మూవీడెస్క్: టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్, వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
ప్రస్థానం చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతను, తన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు.
‘స్నేహగీతం’ సినిమాతో హీరోగా మారిన సందీప్, రొటీన్ లవ్ స్టోరీ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ వంటి హిట్స్‌తో తన మార్క్ క్రియేట్ చేశాడు.
ప్రస్తుతం సందీప్ ‘మజాకా’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘ధమాకా’ ఫేమ్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది.
ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్‌కు మంచి స్పందన వస్తుండటంతో సినిమా హిట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.
గత ఏడాది ‘ఊరిపేరు భైరవ కోన’తో మంచి విజయం అందుకున్న ఆయన, ఇప్పుడు ‘మజాకా’తో మరో బ్లాక్‌బస్టర్ కొట్టాలని చూస్తున్నాడు.
ఇక ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా సందీప్ ఫుల్ బిజీగా ఉన్నాడు. నెట్‌ఫ్లిక్స్ రూపొందిస్తున్న ‘సూపర్ సుబ్బు’ వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్ పోషిస్తున్నాడు.
ఇటీవలి టీజర్‌కు భారీ రెస్పాన్స్ రావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరిగాయి.
అంతేకాకుండా, తమిళ స్టార్ విజయ్ కొడుకు జోసెఫ్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో కూడా సందీప్ కిషన్ హీరోగా ఎంపికయ్యాడు.
తన టాలెంట్‌తో తెలుగు, తమిళ పరిశ్రమల్లో వరుస అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతున్న సందీప్, మిడ్ రేంజ్ హీరోగా ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయిస్‌గా మారాడు.
కొత్తదనాన్ని ఎంచుకుంటూ ప్రయోగాత్మక కథలకు న్యాయం చేసే ఈ హీరో, త్వరలోనే తన రేంజ్‌ను మరింత పెంచేలా కనిపిస్తున్నాడు.