మూవీడెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 : ది రూల్ బాక్సాఫీస్ వద్ద 1860 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, పలు రికార్డులను తిరగరాసింది.
హిందీ మార్కెట్లో ఈ సినిమాకు ఊహించని స్థాయిలో ఆదరణ లభించింది.
అయితే, తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించినప్పటికీ, భారీ లాభాల దశకు ఇంకా చేరుకోలేదని అంటున్నారు.
ఇక, ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త రికార్డులను నమోదు చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత అంతర్జాతీయంగా విపరీతమైన గుర్తింపును పొందింది.
అనేక హాలీవుడ్ దర్శకులు, నటులు ఈ చిత్రాన్ని వీక్షించి ప్రశంసలు కురిపించారు.
ఇప్పుడు పుష్ప 2 కూడా అంతర్జాతీయ స్థాయిలో అలాంటి గుర్తింపును పొందే అవకాశముందని ఫిల్మ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ముఖ్యంగా సినిమాలోని క్లైమాక్స్ ఫైట్ సీన్ ఇంటర్నేషనల్ మీమ్స్ పేజీలను ఆకర్షిస్తుందని టాక్.
ఈ ఫైట్ ఎపిసోడ్‌ను మార్వెల్ స్టైల్ యాక్షన్‌తో పోలుస్తూ, కొందరు హాలీవుడ్ దర్శకులు ఈ దృశ్యంపై ఆసక్తి కనబర్చినట్లు సమాచారం.
అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్, గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్ అంతర్జాతీయంగా కూడా ఆకట్టుకునేలా ఉన్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇప్పటికే ఆర్ఆర్ఆర్ తరహాలో పుష్ప 2 కూడా అంతర్జాతీయ అవార్డుల పోటీలో నిలవొచ్చని చర్చ నడుస్తోంది.