ఏపీ: రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి. ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ప్రజల్లోనే ఉంటామని ప్రకటించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తాజా సమాచారం.
అధికార పక్షం నుంచి సభకు హాజరుకాని పక్షంలో అనర్హత వేటు వేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించి, అసెంబ్లీకి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న జగన్, ప్రథాన ప్రతిపక్ష హోదా తనకు ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీకి దూరంగా ఉన్నారు. అయితే, తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హీట్ పెంచాయి.
60 రోజులకు పైగా సభకు హాజరుకాని సభ్యులపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో జగన్ కుదురుకున్నట్లు కనిపించదని, తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం అసెంబ్లీకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పదవి పోతుందన్న భయం, ప్రజల్లో నమ్మకం పెంచుకోవాలన్న బాధ్యత ఈ రెండు కారణాలూ జగన్ తాజా నిర్ణయానికి కారణమై ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్న నేపథ్యంలో జగన్ హాజరైతే, సభలో అధికార పార్టీతో ఆయన ఎంతవరకు చర్చించగలరన్నది ఆసక్తికరంగా మారింద