fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsఅఫీషియల్: ప్రైమ్ లో రాబోతున్న నాని సినిమా

అఫీషియల్: ప్రైమ్ లో రాబోతున్న నాని సినిమా

NaaniLatestMovie V inAmazonPrime

టాలీవుడ్: నేచుర‌ల్ స్టార్‌ నాని, సుధీర్ బాబులు క‌లిసి న‌టించిన ”వి” సినిమా ఓటీటీలో విడుద‌ల కాబోతుంది. నిన్న నాని చెప్పటినట్టు గానే ఇవాళ అధికారిక ప్రకటన విడుదల చేసాడు. ఈ సెప్టెంబర్ 5 అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదల అవబోతోందని అఫిషియల్ గా నోట్ విడుదల చేసారు నాని. ఊహించని రోజుల్లో ఊహించని ఎక్స్పీరియన్స్ కావాలని కూరుకున్నాం కానీ కుదరలేదు. తన 25 వ సినిమా స్పెషల్ ఎక్స్పీరియన్స్ కావాలని అనుకున్నాం కానీ అంత కన్నా ఎక్కువ స్పెషల్ అవుతుంది అని ట్వీట్ చేసాడు. ఈ పన్నెండేళ్లుగా మీరు నాకోసం థియేటర్లకు వచ్చారు ఇపుడు నేను మీకోసం మీ ఇళ్ళకి వస్తున్నా , మీ ఇంటికి వచ్చి థాంక్స్ చెప్పాలనుకుంటున్నా అని ట్వీట్ చేసాడు నాని. ఇప్పుడు ‘ V ‘ వేట కరోనా ముగిసిపోయి థియేటర్లు ఓపెన్ అవగానే ‘టక్ జగదీష్’ ఆట అని తన తర్వాత సినిమా ముచ్చట ట్వీట్ చేసాడు నాని. నాని మొదటి సినిమా అష్టా చెమ్మ , 25 వ సినిమా ‘ V ‘ రెండింటి విడుదల తేదీ ఒకటే అవడం ఇంకో విశేషం.

క్రియేటివ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నివేద థామస్ అతిథి రావు హైదరిలు హీరోయిన్లుగా నటించారు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాని విలన్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడం విశేషం. ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసరుగా కనిపించనున్నాడు. తెలుగు లో ‘ V ‘ సినిమాతో కొంచెం పేరున్న నటుల సినిమాలు ఓటీటీ లో విడుదల అవడం మొదలయింది. ఇక తరువాత అనుష్క ‘నిశ్శబ్దం‘, మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ‘ఉప్పెన’, యాంకర్ ప్రదీప్ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ , ‘కలర్ ఫోటో’, కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి ‘, ‘మిస్ ఇండియా’ లాంటి సినిమాలు ఓటీటీ లో విడుదల అవడానికి సిద్ధంగా ఉన్నాయ్. చూడాలి ముందు ముందు ఇక ఎన్ని సినిమాలు ఓటీటీ బాట పడతాయో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular