ఏపీ: రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు మారటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి అనంతరం జగన్ ఇంకా అదే రీతిలో వ్యవహరిస్తూ, నెక్స్ట్ 30 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలోనే ఉంటుందని తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యాయి.
2024 ఎన్నికల ముందు కూడా జగన్ ఇదే రకమైన డైలాగులు చెప్పారని, కానీ ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
కూటమి హయాంలో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని, అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేస్తామని జగన్ ప్రకటించారు.
ఇటీవల విజయవాడలో పార్టీ కార్యకర్తల సమావేశంలో జగన్ మాట్లాడుతూ, తనపై పెట్టిన కేసులు ఎలా ఎదుర్కొన్నానో తెలిపారు.
వైసీపీ నేతల వెంట్రుక కూడా పీకలేరని, తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పిన జగన్ వ్యాఖ్యలు, గతంలో చేసిన డైలాగుల తరహాలోనే ఉన్నాయని వ్యంగ్యంగా వ్యాఖ్యలు వస్తున్నాయి.
జగన్ ఇంకా కలల ప్రపంచంలోనే ఉన్నారా? లేదా రాజకీయాలు గమనించకపోతున్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది.