తెలంగాణ హైకోర్టు వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని గుంటూరు జిల్లా పల్నాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
మాజీ మంత్రితో పాటు ఆమె వ్యక్తిగత కార్యదర్శులు రామకృష్ణ, ఫణి, అలాగే అప్పటి సీఐ సూర్యనారాయణపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించింది. ఈ వ్యవహారం వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
అప్పట్లో సోషల్ మీడియాలో జగన్ పాలనపై విమర్శలు చేసిన చిలకలూరిపేటకు చెందిన పిల్లి కోటి అనే వ్యక్తిని మంత్రి రజనీ ఆదేశాల మేరకు పోలీసులు అరెస్టు చేశారు.
అనేక చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై కోటి నేరుగా హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, విచారణ అనంతరం కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
గుంటూరు జిల్లా పల్నాడు పోలీసులు 24 గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కోర్టుకు సమర్పించాల్సి ఉంది. హైకోర్టు తుది విచారణలో ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.