ఏపీ: మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక మంత్రులను కలుసుకుని రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించారు. రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వివరాలు ఇచ్చారు.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయాలని కోరారు. అలాగే, విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్రకటించిన ప్యాకేజీకి కృతజ్ఞతలు చెప్పేందుకు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిశారు.
లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఐటీ, రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాలను విస్తరించేందుకు ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న హామీకి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
హిందూ దేవాలయాల్లో ఇతర మతాచారాలు పాటించడంపై స్పందించిన లోకేశ్, ఇలాంటి చర్యలను నియంత్రించడం సర్వసాధారణమని తెలిపారు. అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలంటే అవసరమైన వారందరిని కలవాలని, అందులో రాజీ లేదని స్పష్టం చేశారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను కూడా ఈ పర్యటనలో కలవడం విశేషం. కూటమి ప్రభుత్వ పాలనపై ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం కోసం ఈ సమావేశం జరిగిందని లోకేశ్ పేర్కొన్నారు.