మూవీడెస్క్: మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండగా, ఇప్పుడు మళ్లీ సెట్స్‌పైకి వచ్చేశారు.
2023లో వరుణ్ తేజ్‌తో వివాహం జరిగిన తర్వాత కొంత విరామం తీసుకున్న లావణ్య, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. లావణ్య తాజాగా మలయాళ నటుడు దేవ్ మోహన్‌తో కలిసి సతీ లీలావతి అనే చిత్రంలో నటిస్తున్నారు.
తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రిలేషన్‌షిప్ డ్రామాగా తెరకెక్కుతోంది.
1995లో వచ్చిన అదే పేరుతో వచ్చిన సినిమాతో ఎలాంటి సంబంధం లేదని దర్శకుడు క్లారిటీ ఇచ్చారు.
భార్యాభర్తల మధ్య సున్నితమైన సంఘర్షణను వినోదాత్మకంగా, భావోద్వేగపూర్వకంగా చూపించనున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ, “లావణ్య ఈ పాత్రకు పరఫెక్ట్ ఛాయిస్. ఆమె పెర్ఫార్మెన్స్ గతంలో చాలా బాగా ఆకట్టుకుంది.
అందుకే ఈ పాత్రకు ఆమెనే ఎంచుకున్నాం” అని తెలిపారు. ఈ సినిమాలో దేవ్ మోహన్-లావణ్య జంటగా ఆకట్టుకోనున్నారని చెబుతున్నారు.
ఇప్పటికే సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, నిర్మాతలు దీనిని గ్రాండ్‌గా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
లావణ్య పెళ్లి తర్వాత ఫుల్ ఫోకస్‌తో సినిమాలు చేస్తున్నారన్న విషయమే అభిమానులను ఆనందానికి గురి చేస్తోంది.
ఇక త్వరలో సినిమాకు సంబంధించిన మరో కీలకం అప్డేట్ ఇవ్వనున్నారు.