ఢిల్లీ: టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున తన ఫ్యామిలీతో కలిసి ఢిల్లీ పర్యటనలో భాగంగా టీడీపీ కార్యాలయాన్ని సందర్శించడం ఆసక్తికరంగా మారింది.
గతంలో వైసీపీ అధినేత జగన్తో స్నేహబంధం ఉందని చెప్పుకున్న నాగ్, ఏనాడూ వైసీపీ కార్యాలయానికి వెళ్లలేదని తెలుస్తోంది. కానీ తాజాగా, ఆయన ఢిల్లీలోని టీడీపీ పార్లమెంటరీ కార్యాలయానికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
నాగార్జున తన భార్య అమల, కుమారుడు నాగచైతన్య, కోడలు శోభితతో కలిసి పార్లమెంట్లో టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరీతో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు బైరెడ్డి శబరీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి.
దీంతో నాగ్ టీడీపీకి దగ్గరయ్యారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే నిజానికి, నాగార్జున తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావుపై రాసిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమం కోసం ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది.
ఈ సందర్భంలోనే ఆయన పలువురు ప్రముఖులను కలవడం జరిగిందని సమాచారం. అయితే టీడీపీ కార్యాలయానికి వెళ్లినందుకు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.