ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు మోటరోలా త్వరలో భారతీయ మార్కెట్లో ఒక సరికొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేయనుంది. అద్భుతమైన పనితనం, అద్భుతమైన కెమెరా, ఇంకా ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ కోసం సిద్ధంగా ఉండండి “సమ్ థింగ్ బిగ్ ఈజ్ కమింగ్” అంటూ మోటొరోలా ఒక టీజర్ ను రిలీజ్ చేసింది.
భారత దేశంలో తమ స్మార్ట్ఫోన్ను దేశీయ ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ద్వారా లాంచ్ చేయనున్నామని ట్వీట్ చేసింది. ఆగస్టు 24 న తమ స్మార్త్ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఈ స్మార్ట్ఫోన్ పేరు, ఫీచర్లను ప్రస్తుతానికి స్పష్టం చేయనప్పటికీ, మోటో ఈ7 ప్లస్ పేరుతో దీన్ని తీసుకు రానుందని మార్కెట్ అంచనా.
బిగ్ స్క్రీన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్పీకర్ గ్రిల్ టీజర్లో కనిపించడం చూడొచ్చు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీబీ ర్యామ్, 64 జిబి స్టోరేజ్ , డ్యూయల్-రియర్ కెమెరా ప్రధాన ఆకర్షణీయంగా ఉండనున్నాయని తెలుస్తోంది.