మూవీడెస్క్: టాలీవుడ్ లో ఇప్పుడు చాలా మంది దర్శకులు ఒకే నిర్మాణ సంస్థకు పరిమితం అవుతున్నారు.
హిట్ ఇచ్చాక కొత్త బ్యానర్లో సినిమా చేసే అవకాశం ఉన్నప్పటికీ, నిర్మాతలు ముందుగానే అడ్వాన్స్‌లు ఇచ్చి తమ దగ్గరే బంధించేస్తున్నారు.
కొందరికి ఇది కంఫర్ట్‌గా ఉంటే, మరికొందరికి బయటకు వెళ్లే అవకాశం లేకుండా చేస్తోంది.
త్రివిక్రమ్ 2012 నుంచి హారిక & హాసిని క్రియేషన్స్‌లోనే సినిమాలు చేస్తున్నారు.
అనిల్ రావిపూడి ఎక్కువగా దిల్ రాజు బ్యానర్లోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు.
శేఖర్ కమ్ముల కూడా కుబేరా తర్వాత మరో సినిమా అదే సంస్థలో చేయబోతున్నారు.
చందూ మొండేటి కూడా తండేల్ తర్వాత మళ్లీ గీతా ఆర్ట్స్‌లోనే ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు సమాచారం.
సుకుమార్ అయితే పూర్తిగా మైత్రి మూవీ మేకర్స్‌తోనే సినిమాలు చేస్తున్నారు. పుష్ప 1, 2 తర్వాత రామ్ చరణ్‌తో ఓ భారీ సినిమా కూడా ఇదే బ్యానర్లో ఉంది.
సందీప్ రెడ్డి వంగా కూడా టీ-సిరీస్‌తో వరుసగా సినిమాలు చేస్తున్నారు.
ఈ పరిస్థితుల వల్ల ఇతర నిర్మాతలకు స్టార్ డైరెక్టర్లను అప్రోచ్ చేయడం కష్టంగా మారుతోంది.
కానీ, ఇదే సమయంలో దర్శకులకు స్థిరత, భద్రత లభిస్తోంది.
ఇది టాలీవుడ్లో కొత్త ట్రెండ్‌గా మారుతుందా, లేక తాత్కాలికమా? వేచి చూడాలి.