మూవీడెస్క్: లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. అయితే నటుడు, థర్టీ ఇయర్స్ పృథ్వి చేసిన ఓ కామెంట్ మాత్రం పెద్ద చర్చగా మారింది.
సినిమా మేకల సత్యం క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ, షూటింగ్ సమయంలో మొదట 150 మేకలు ఉండగా, చివరికి 11 మేకలే మిగిలాయని చెప్పడం వివాదాస్పదమైంది.
ఈ సంఖ్య ఉద్దేశపూర్వకంగా వైసీపీ ఓడిపోవడాన్ని గూర్చి చెప్పినట్లుగా అనిపించిందని కొందరు భావించారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో కొందరు లైలాను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దిద్దుబాటు చర్యగా, లైలా టీమ్ దీనిపై ఓ స్పష్టత ఇవ్వబోతుందనే టాక్ ఉంది.
ఈ విషయంలో రాజకీయ విమర్శలు సినిమా రన్‌పై ప్రభావం చూపించవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
సినిమాలు, రాజకీయాలు వేర్వేరు అయినా, కొన్నిసార్లు అనుకోకుండా ముడిపడతాయి.
చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చిన ఈ ఈవెంట్లో స్పీచ్‌లు ప్రధానంగా చర్చకు రావాలి, కానీ ఇప్పుడు పృథ్వి వ్యాఖ్యలే హైలైట్ అయ్యాయి.
ఇదంతా లైలా టీమ్‌కు మింగుడుపడని పరిణామంగా మారింది.
లైలా విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో, హీరో విశ్వక్ సేన్ ప్రమోషన్స్‌పై పూర్తి దృష్టి పెట్టాడు.
బ్రహ్మానందం సినిమా మినహా పెద్ద పోటీ లేకపోవడం లైలాకు కలిసొచ్చే అంశంగా ఉంది.
కానీ ఈ వివాదం సినిమా ఓపెనింగ్స్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచిచూడాలి!