మూవీడెస్క్: శర్వానంద్ తాజాగా నారి నడుమ మురారి టైటిల్‌ను తీసుకుని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో క్లాసిక్ టైటిల్ జానీను తన కొత్త సినిమాకు పెట్టబోతున్నట్టు టాక్.
యువి క్రియేషన్స్ బ్యానర్లో అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జానీ పేరును ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేసినట్టు సమాచారం.
జానీ సినిమా అప్పట్లో భారీ డిజాస్టర్ అయినా, పవన్ కళ్యాణ్ దర్శకత్వ ప్రతిభకు విమర్శకులు ఇప్పటికీ మెచ్చుకుంటూ ఉంటారు.
ఇప్పుడు అదే టైటిల్ శర్వానంద్‌కి దొరకడం ఆసక్తికరం.
బైక్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు రాజశేఖర్ శర్వా తండ్రిగా నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ టైటిల్స్ వాడటం కొత్తేమీ కాదు. విజయ్ దేవరకొండ ఖుషి, వరుణ్ తేజ్ తొలిప్రేమ, నితిన్ తమ్ముడు సినిమాలు చేస్తున్నారు.
దీంతో పవన్ ఫ్యాన్స్ అకీరా నందన్ సినిమాలకు ఏ టైటిల్స్ మిగులుతాయో అంటూ ఫీలవుతున్నారు.
అయితే గబ్బర్ సింగ్, బద్రి లాంటి టైటిల్స్ మాత్రం సురక్షితంగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ సినిమా అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
పవన్ టైటిల్‌ను ఉపయోగించుకున్న ఈ సినిమా శర్వా కెరీర్లో స్పెషల్‌గా నిలుస్తుందా? లేదా? అనేది చూడాలి.