మూవీడెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ తో బిగ్ హిట్ అందుకున్న తర్వాత, నెక్స్ట్ కూలీ తో రాబోతున్నాడు.
లోకేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఇటీవల చెన్నై విమానాశ్రయంలో రజనీపై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.
తాజా సమాచారం మేరకు, వైజాగ్, హైదరాబాద్‌లలో చివరి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మార్చి నాటికి షూటింగ్ పూర్తిచేయాలని మేకర్స్ నిర్ణయించారు.
ఇక అభిమానులను ఉత్సాహపరిచేలా ఈ నెలలోనే తొలి గ్లింప్స్ విడుదల చేయనున్నారు.
ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంతో కథ సాగనుండగా, యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ కానున్నాయి.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
రజనీ మాస్ స్వాగ్తో కూలీ మరో సెన్సేషనల్ హిట్ అవుతుందా? అనేది వేచి చూడాలి.