fbpx
Wednesday, February 12, 2025
HomeMovie Newsనాని ది ప్యారడైజ్ గ్లింప్స్ రాబోతోందా?

నాని ది ప్యారడైజ్ గ్లింప్స్ రాబోతోందా?

NANI-THE-PARADISE-GLIMPSE-COMING-SOON
NANI-THE-PARADISE-GLIMPSE-COMING-SOON

మూవీడెస్క్: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్-3తో బిజీగా ఉండగా, త్వరలోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ది ప్యారడైజ్ ను మొదలు పెట్టబోతున్నాడు.

దసరా బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

ఇందులో నాని మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం.

తాజాగా, ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ వీడియో సిద్ధంగా ఉందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

కేవలం అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్‌లో ఉందని, అది పూర్తి కాగానే గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నారని టాక్.

ఫిబ్రవరి 20న ఈ గ్లింప్స్ విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది.

ది ప్యారడైజ్ సినిమాను సాహు గారపాటి తన షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.

ఈ సినిమా నానికి మరో కొత్త యాంగిల్‌ను అందించే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ గ్లింప్స్ ద్వారా ది ప్యారడైజ్ ఏ స్థాయిలో ఉంటుందనేది తెలియనుంది.

నాని ఫ్యాన్స్ అయితే ఈ వీడియో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular