మూవీడెస్క్: పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ (AKIRA NANDAN) ఇటీవల తన తండ్రితో ఎక్కువగా కనిపిస్తూ అభిమానులను ఆకర్షిస్తున్నాడు.
ఏపీ ఎన్నికల విజయంతో పవన్‌తో మరింత సమీపంగా ఉంటున్న అకిరా, తాజా దక్షిణాది పర్యటనలో కూడా ఆయనతో పాటుగా దర్శనాలు చేసుకున్నాడు.
కేరళలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించగా, అకిరా కూడా తన తండ్రితో సమయాన్ని గడిపాడు.
ఈ సందర్భంగా అకిరా లుక్ ఫ్యాన్స్‌లో కొత్త హైప్‌ను క్రియేట్ చేసింది.
గడ్డం పెంచి, స్టైలిష్ లుక్‌లో ఉన్న అకిరా, తెల్లటి కుర్తాలో పవన్ స్టైల్ ఫాలో అవుతున్నట్లు కనిపించాడు.
పవన్‌కు తగ్గ కొడుకు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఇంతకు ముందటి ఫోటోలతో పోలిస్తే, ఇప్పుడు అకిరా మరింత మేచ్యూర్డ్ లుక్‌లో ఉన్నాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
తల్లి రేణు దేశాయ్ అతని సినిమాల ఎంట్రీపై క్లారిటీ ఇవ్వకపోయినా, అకిరా లేటెస్ట్ లుక్ చూసిన అభిమానులు మాత్రం త్వరలో అతని గురించి ఓ సర్ప్రైజ్ అప్డేట్ రావచ్చని ఊహిస్తున్నారు.