మూవీడెస్క్: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
విడుదలైన రోజు నుంచి మంచి టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా, వసూళ్ల పరంగా స్టడీగా పెరుగుతోంది.
చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నాగ చైతన్య కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది.
వీకెండ్‌లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో నాలుగు రోజులకు 73.20 కోట్లను రాబట్టిన తండేల్, ఐదో రోజు కూడా స్టడీగా కొనసాగింది.
దీంతో ప్రపంచవ్యాప్తంగా 80.12 కోట్ల మార్క్‌ను చేరుకుంది.
వర్కింగ్ డేస్‌లోనూ సినిమా స్ట్రాంగ్‌గా ఉండటంతో వంద కోట్ల క్లబ్ చేరడం ఖాయమని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను రప్పించడంతో పాటు, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది.
నాగ చైతన్య కెరీర్‌లో ఇది హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచే అవకాశం ఉంది. మరి వంద కోట్ల క్లబ్‌లోకి ఎప్పుడు చేరుతుందో చూడాలి!