విజయ్ దేవరకొండ కొత్త స్టైల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న VD12 సినిమాకు కింగ్‌డమ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ విడుదలయ్యాక, అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం, విజువల్ ప్రెజెంటేషన్, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది.
టీజర్‌లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ మాస్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది. “రాజు కోసం రణం.. ఈ యుద్ధం ఆగదు” అంటూ కథలోని ఇంటెన్స్ ఎమోషన్స్ హైలైట్ అయ్యాయి. విజయ్ దేవరకొండ పాత్ర ఖైదీల మధ్య గడిపే తీరు, యాక్షన్ ఎలిమెంట్స్, చివర్లో “తగలబెట్టేస్తా” అన్న డైలాగ్ ఫుల్ మాస్ మూడ్‌ను తెచ్చాయి.
పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2025 మే 30న గ్రాండ్‌గా విడుదల కానుంది. హిందీలో రణబీర్ కపూర్, తమిళంలో సూర్య వాయిస్ ఓవర్ అందించడం విశేషం.
ఈ పాన్-ఇండియా సినిమాకు అనిరుధ్ మ్యూజిక్, గౌతమ్ తిన్ననూరి స్టైల్ మేకింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.