పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమా మార్చి 28న విడుదల కానుంది. అయితే తాజా పరిస్థితులను చూస్తే ఈ డేట్ మరోసారి మారే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.
సినిమా పూర్తయినప్పటికీ కొన్ని కీలక సన్నివేశాలు ఇంకా చిత్రీకరించాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో, ఈ సీన్స్‌కి డేట్స్ ఇప్పట్లో దొరకేలా కనిపించట్లేదు. జనసేన, టీడీపీ కూటమిగా ముందుకు వెళ్లే సమయంలో ఆయన పూర్తి సమయాన్ని రాజకీయ కార్యక్రమాలకు కేటాయిస్తున్నారు.
ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో పవన్ ముందుగా ఇచ్చిన షూటింగ్ షెడ్యూల్‌పై సందేహాలు పెరుగుతున్నాయి. చిత్రబృందం ఈ సన్నివేశాలను పూర్తిచేయాలనుకుంటున్నా, పవన్ అందుబాటులోకి రావాల్సి ఉంది.
ముందుగా అనుకున్నట్లుగా మార్చి రెండో వారం షూటింగ్ చేస్తే, మూవీ విడుదల ఖాయమని అంటున్నారు. కానీ రాజకీయాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ డేట్ మరోసారి మారవచ్చనే అనుమానాలు కొనసాగుతున్నాయి.