స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ వన్డే క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్ తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో సౌమ్య సర్కార్, మెహిదీ హసన్, జాకీర్ అలీ వికెట్లు తీసి 200 వన్డే వికెట్లు పూర్తి చేశాడు.
103 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ అందుకుని అజిత్ అగార్కర్ (133), జహీర్ ఖాన్ (144) రికార్డులను బద్దలు కొట్టాడు.
అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా షమీ నిలిచాడు. అంతేకాక, మిచెల్ స్టార్క్ (102) తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో నిలిచాడు. సక్లైన్ ముస్తాక్ తో సమానంగా 104 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు.
బంతుల పరంగా కూడా షమీనే టాప్‌లో ఉన్నాడు. 5126 బంతుల్లో 200 వికెట్లు తీసి, స్టార్క్ (5240) ను దాటాడు.
ఈ మ్యాచ్‌లో షమీ 10 ఓవర్లు బౌలింగ్ చేసి 53 పరుగుల కు 5 వికెట్లు తీయడం విశేషం.
వన్డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు..
అనిల్ కుంబ్లే – 334 వికెట్లు
జవగళ్ శ్రీనాథ్ – 315 వికెట్లు
అజిత్ అగార్కర్ – 288 వికెట్లు
జహీర్ ఖాన్ – 269 వికెట్లు
హర్భజన్ సింగ్ – 265 వికెట్లు
కపిల్ దేవ్ – 253 వికెట్లు
రవీంద్ర జడేజా – 226 వికెట్లు
మహ్మద్ షమీ – 202* వికెట్లు