ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మరియు సోషల్ మీడియా వేదికలపై అనుచిత కంటెంట్ పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కఠినంగా స్పందించింది. ఐటీ చట్టం-2021 ప్రకారం కచ్చితమైన మార్గదర్శకాలను పాటించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
వయస్సు ఆధారంగా కంటెంట్‌ను విభజించడం, పిల్లలకు A రేటెడ్ కంటెంట్ అందకుండా తగిన చర్యలు తీసుకోవడం అవసరమని కేంద్రం తెలిపింది. నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
స్వీయ నియంత్రణ ప్రతి ఓటీటీ మరియు సోషల్ మీడియా సంస్థల బాధ్యతగా కేంద్రం పేర్కొంది. సమాజ నైతికతకు హాని కలిగించే కంటెంట్ ప్రసారం కాకుండా ప్రమాణాలు పాటించాలని స్పష్టంగా సూచించింది.
సుప్రీం కోర్టు కూడా అనుచిత కంటెంట్‌పై ఆంక్షలు పెంచాలని ఇటీవల సూచించిన విషయం గమనార్హం. డిజిటల్ వేదికలు మార్గదర్శకాలను అనుసరించి, పిల్లలు, యువతపై ప్రతికూల ప్రభావం లేకుండా కంటెంట్‌ను నియంత్రించాలనే కేంద్రం స్పష్టం చేసింది.