టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరోసారి హిందీ రీమేక్ ట్రాక్ ఎక్కారు. ఇటీవల వేంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం హిట్ అవడంతో, దిల్ రాజు అదే సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. కానీ ఇది రిస్కీ గేమ్ అవుతుందనే చర్చలు కూడా ఉన్నాయి.
ఇప్పటికే జెర్సీ, హిట్ సినిమాలను హిందీలో రీమేక్ చేసినా, ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాయి. ఈసారి కూడా అనిల్ రావిపూడి డైరెక్షన్ లేకుండా రీమేక్ చేస్తుండడం పెద్ద సవాలుగా మారింది.
దిల్ రాజు, హిందీ వెర్షన్ కోసం అక్షయ్ కుమార్ ను హీరోగా ఫైనల్ చేయాలని అనుకుంటున్నారు. అయితే అక్షయ్ గత కొంతకాలంగా హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నాడు.
మొత్తానికి దిల్ రాజు ఈ రీమేక్‌తో హిట్ కొడతారా? లేక మరోసారి బాక్సాఫీస్ వద్ద నిరాశే ఎదురవుతుందా? అనేది వేచి చూడాలి.