టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారడానికి దారితీసిన సినిమా పెళ్లి చూపులు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చిన్న బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ బ్లాక్ బస్టర్‌గా నిలిచి, విజయ్ కెరీర్‌ను మలుపుతిప్పింది. ఇప్పుడు ఆ క్లాసిక్ కి సీక్వెల్ రాబోతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
తరుణ్ భాస్కర్ ఇప్పటికే సీక్వెల్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదట మరో హీరోతో సినిమాను ప్లాన్ చేసినా, ఇప్పుడు విజయ్ దేవరకొండతోనే చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
అయితే, విజయ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టిన ఈ దశలో చిన్న లవ్ స్టోరీకి ఓకే చెప్తాడా? అనే అనుమానం ఉంది.
విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ సీక్వెల్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ సృష్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.