fbpx
Saturday, February 22, 2025
HomeMovie Newsఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ: గోల్డెన్ ట్రయాంగిల్ మాఫియా స్టోరీ!

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ: గోల్డెన్ ట్రయాంగిల్ మాఫియా స్టోరీ!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా గురించి ఆసక్తికర సమాచారం లీకైంది. ఈ సినిమా కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు, గోల్డెన్ ట్రయాంగిల్ మాఫియా నేపథ్యంలో సాగుతుందట. 1950ల నుంచి మయన్మార్, థాయిలాండ్, లావోస్ ప్రాంతాల్లోని డ్రగ్స్ హబ్ ఆధారంగా ఈ కథ ఉండనుందని సమాచారం.

సినిమాలో ఎన్టీఆర్ ఒక సామాన్య వ్యక్తిగా ప్రారంభమై, మాఫియా లీడర్‌గా ఎదిగే పాత్రలో కనిపిస్తారట. గోల్డెన్ ట్రయాంగిల్ గ్యాంగ్స్‌ను తన స్టైల్లో ఎదుర్కొనే హీరోగా తారక్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించనున్నాడు. రా, ఇంటెలిజెన్స్, రివేంజ్ అంశాలతో ఈ సినిమా మరింత ఇంటెన్స్‌గా ఉండనుంది.

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకి ₹360 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు. హాలీవుడ్ స్థాయి విజువల్స్, గ్రాండ్ సెట్స్‌తో సినిమా తెరకెక్కనుంది. 2025లో పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ మూవీ, బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular