టాలీవుడ్: ‘తేజ సజ్జ‘ అనే పేరు వినగానే గుర్తుపట్టలేము కానీ ఇంద్ర సినిమాలో చిన్నప్పటి ఇంద్రసేనారెడ్డి గా ‘నేనున్నా నాయనమ్మ’ అన్న సీన్ లో యాక్ట్ చేసిన అబ్బాయి అంటే వెంటనే గుర్తుపడతాం. ఆ అబ్బాయే తేజ సజ్జ. ఇప్పుడు ఈ తేజ హీరోగా రాబోతున్నాడు. ఆల్రెడీ సమంత ‘ఓహ్ బేబీ’ సినిమాలో మనవడి పాత్రలో మెప్పించాడు ఈ కుర్ర హీరో. చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు ఇండస్ట్రీ లో ఉన్న హీరోలందరితోని ఒక రౌండ్ వేసాడు ఈ కుర్రాడు. ప్రస్తుతం ఈ అబ్బాయి ‘జాంబీ రెడ్డి’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు.
‘అ!’, ‘కల్కి’ లాంటి సినిమాలతో తానెంత ప్రత్యేక దర్శకుడో నిరూపించుకున్నాడు ప్రశాంత్ వర్మ. తాను తియ్యబోయే మూడవ సినిమాగా జాంబీ రెడ్డి సినిమా తీస్తున్నాడు. దీనికి కరోనా నేపథ్యం ఉన్న కథని ఎంచుకున్నాడు ఈ డైరెక్టర్. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కానుకగా టైటిల్ రోల్ పోషిస్తున్న హీరో బ్యాక్ సైడ్ లుక్ ని విడుదల చేశారు ఈ సినిమా టీం. ఈరోజు ఈ సినిమా హీరో ‘తేజ సజ్జ’ పుట్టిన రోజు సందర్భంగా ఫుల్ లుక్ రెవీల్ చేసారు ఈ సినిమా మేకర్స్. తేజ చొక్కాపై చిరంజీవి జాంబీ లుక్, అతడి ముందు జాంబీలు, చేతిలో గద, ఆ ముందర వీరహనుమాన్ నాట్య మండలి ఉన్నాయి. కర్నూల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతోందని ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఉండబోతోందని మీరు ఊహించని విధంగా ఈ సినిమా కథ ఉండబోతోందని ఒక వీడియో ద్వారా ఇదివరకే తెలియచేసారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.