స్పోర్ట్స్ డెస్క్: చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా మొదటి విజయం సాధించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 351 పరుగులు చేసింది. కానీ, ఆ భారీ లక్ష్యాన్ని ఆసీస్ 15 బంతులు మిగిలుండగానే ఛేదించి చరిత్ర సృష్టించింది.
ఆస్ట్రేలియా విజయంలో జోష్ ఇంగ్లిస్ (120*; 86 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సులు) అద్భుత శతకం బాదాడు. అలెక్స్ కేరీ (69), మాథ్యూ షార్ట్ (63) అర్ధశతకాలు నమోదు చేశారు. ట్రావిస్ హెడ్ (6), స్టీవ్ స్మిత్ (5) త్వరగా అవుట్ అయినా, ఇంగ్లిస్ ధాటిగా ఆడుతూ జట్టును గెలిపించాడు.
ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో ఓపెనర్ బెన్ డకెట్ (165; 143 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సులు) భారీ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జో రూట్ (68) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కానీ మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో డ్వారిషూస్ 3, ఆడమ్ జంపా 2, లబుషేన్ 2 వికెట్లు తీయగా, మ్యాక్స్వెల్ ఒక వికెట్ సాధించాడు. చివరికి ఆసీస్ ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకెళ్లింది.