fbpx
Friday, November 29, 2024
HomeBusinessస్టీవ్‌ జాబ్స్‌ కలను నెరవేర్చిన యాపిల్‌ సీఈఓ టిం కుక్

స్టీవ్‌ జాబ్స్‌ కలను నెరవేర్చిన యాపిల్‌ సీఈఓ టిం కుక్

TIM-COOK-FULFILLS-STEVE-JOBS-DREAMS

కాలిఫోర్నియా: మొబైల్‌ ఫోన్లను సాంకేతికంగా, మరియు ఆకర్షనీయంగా తీర్చిదిద్దడంలో యాపిల్‌ సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ అప్పట్లొనే ఓ ట్రెండ్‌ సెట్‌ చేశారు. స్టీవ్‌ జాబ్స్‌ 2011 సంవత్సరంలో క్యాన్సర్‌తో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీవ్‌ జాబ్స్‌, టిమ్‌ కుక్‌లు ఇద్దరు సాంకేతికంగా యాపిల్‌ కంపెనీని నెంబర్‌ వన్‌ స్థానంలో నిలబెట్టారు.

స్టీవ్‌ జాబ్స్ అనంతరం కుక్‌ సీఈఓగా బాధ్యతలు చేపట్టే సమయానికి యాపిల్ కంపెనీ 400 బిలియన్‌ డాలర్లు మాత్రమే మూలధనంగా ఉండేది. కానీ ఇప్పుడు కుక్‌ సారథ్యంలో యాపిల్‌ సంస్థ ఆదాయం అప్పటికంటే ఐదు రెట్లు పెరిగింది. ప్రస్తుతం యాపిల్‌ సంస్థ మార్కెట్లో ఐఫోన్లతో తన హవా కొనసాగిస్తూ యూఎస్‌లో 2 ట్రిలియన్‌ డాలర్ల ఆదాయం సాధించిన మొట్టమొదటి కంపెనీగా రికార్డు సృష్టించింది. యాపిల్‌ సంస్థ బ్రాండ్‌ నిలబెట్టడానికి కుక్‌ తీవ్రంగా శ్రమించారు.

టిం కుక్ ఎదుర్కొన్న అతి ముఖ్యమైన సవాళ్లు: ఎఫ్‌బీఐ విపరీత ఆంక్షలు, చైనాతో యూఎస్‌ ట్రేడ్‌ వార్‌, కరోనా వైరస్‌, ఆర్థిక మాంధ్యం లాంటి ఇన్ని సమస్యలను అధిగమంచి యాపిల్‌ను ఉన్నత స్థానంలో నిలిపాడు. పౌర హక్కులు, పునరుత్పాదక శక్తి లభ్యతపై తన అభిప్రాయాన్ని ప్రపంచానికి చెప్పి మేధావుల ప్రశంసలను అందుకున్నారు. వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక సాఫ్ట్ వేర్‌, ఎక్స్టెండెడ్ వారంటీ ప్రోగ్రామ్‌లు, సంగీతం, వీడియో, ఆటలు తదితర విభాగాలను ప్రారంభించి వినియోగదారులను ఆకట్టుకోవడంలో ఘన విజయం సాధించారు.

పాపులర్ అయిన మూవీ‌ యాప్‌ నెట్‌ఫ్లక్స్‌ను కొనుగోళ్లు చేసి తన సత్తా చాటాడు. కంపెనీలకు రేటింగ్‌ ఇచ్చే ఫార్చ్యూన్ సంస్థ యాపిల్‌ 50 బిలియన్‌ వార్షిక ఆదాయాన్ని సంపాదిస్తున్నట్టు పేర్కొంది. మరోవైపు ఈవ్స్ సంస్థ అంచనా ప్రకారం యాపిల్‌ సేవల విభాగంలో 750 బిలియన్‌ డాలర్ల మూలధనం ఉన్నట్లు తెలిపింది. స్టీవ్‌ జాబ్స్‌ కన్న కలలు కుక్‌ నెరవేరుస్తున్నారని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular