టాలీవుడ్: ఇండియన్ సినిమా బిగ్గీస్ అయిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అలాగే ఇండియా లో ఉన్న దాదాపు అన్ని భాషల్లో అద్బుతమైన పాటలు పాడిన దేశం మెచ్చిన గాయకుడు శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రమణ్యం. వీళ్ళిద్దరూ కూడా ఈ మధ్య కరోనా బారిన పడ్డ వాల్లే. వీళ్ళే కాకుండా సినిమా ఇండస్ట్రీ నుండి చాలా మంది కరోనా బారిన పడి కోలుకున్నవాళ్ళే. వీరిద్దరూ ఎందుకు స్పెషల్ అంటే వాళ్ళ వాళ్ళ రంగాలలో వాల్లే టాప్ అలాగే వాళ్ళ వయసు దృష్ట్యా కూడా ఇది వాళ్ళు సాధించిన అద్భుతమైన విజయం మాత్రమే కాకుండా మరెందరికో ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. వీరి ప్రయాణంలో వీళ్ళతో పాటు ఇంకెంతో మందిని చాలా ఎత్తుకు తీసుకెళ్లిన మహానుభావులు.
కరోనా నుండి కోలుకున్న తర్వాత బిగ్ బి అమితాబ్ తన పనిలోకి దిగిపోయారు. ఆయన హోస్ట్ చేస్తున్న రియాలిటీ గేమ్ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ సీజన్ 12 షూటింగ్‌లో పాల్గొన్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ షోకి సంబంధించిన ప్రోమోల కోసం షూటింగ్‌లో పాల్గొన్నారు.కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కేబీసీ 12 (KBC-12) షూటింగ్ మొదలైందని తెలిపారు. తనకు కేబీసీతో 20 సంవత్సరాల అనుబంధన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. సెట్‌కి సంబంధించిన ఫోటోలను అమితాబ్ షేర్ చేశారు. తిరిగి పనిలోకి వచ్చాను. పీపీఈ కిట్స్ ధరించిన వారితో కలిసి షూటింగ్ చేస్తున్నా. 2000 సంవత్సరంలో ప్రారంభమైన మా ఈ షో ఈ ఏడాదితో 20వ ఏళ్లు పూర్తి చేసుకుంది అని చెప్పారు.
అలాగే నిన్నటి వరకు విషమంగా ఉన్న ఎస్ పి బాలు ఆరోగ్యం ఇవాల నిలకడగా ఉందని తన కుమారుడు చరణ్ పేర్కొన్నాడు. కరోనా కూడా నెగటివ్ వచ్చిందని చెప్పారు. వీళ్ళ ఆరోగ్యం బాగుండి మళ్ళీ వాళ్ళు తమ పని ప్రారంభించి ఇంకెంతో కలం తమకి ఎంటర్టైన్మెంట్ కలిగించాలని చాలా మంది అభిమానులు ప్రార్థనలు చేసారు. వాళ్ళ ప్రార్థనలు, డాక్టర్ ల చికిత్స ఫలించి వీళ్లిద్దరు ఇప్పుడు మళ్ళీ కోలుకుని మరింత ఉత్సాహంతో తమ రెగ్యులర్ కార్యక్రమాల్లో పాలు పంచుకోబోతున్నారు.