స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ ప్రతినిధి షమా మహ్మద్ చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. అతను లావుగా ఉన్నాడని, బరువు తగ్గాల్సిన అవసరం ఉందని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీసీఐ సహా పలువురు మాజీ క్రికెటర్లు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తన స్పందన తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి బాడీ షేమింగ్, అవమానకర వ్యాఖ్యలు కొత్త కాదని, గతంలో కూడా వారు పలువురిపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై కాంగ్రెస్ ప్రతినిధి సలహాలు అవసరమా? అంటూ కేటీఆర్ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఒక మంత్రి సినిమా తారలపై చేసిన వ్యాఖ్యలతో కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తుచేశారు.
అంతేగాక, రోహిత్ శర్మ గొప్ప ఆటగాడని, ఆయన ప్రతిభకు ఎవరూ ఢీకొనలేరని స్పష్టం చేశారు. రోహిత్‌పై కాంగ్రెస్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యల వల్ల ఆయన ప్రతిష్ఠ దెబ్బతినదని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ వివాదం రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో, రోహిత్‌కు మద్దతుగా పలువురు క్రికెట్ అభిమానులు, రాజకీయ నాయకులు కేటీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.