ఏపీ: రాజకీయం మేనిఫెస్టో, సంక్షేమ పథకాల చుట్టూ నడుస్తోందనేది చాలామంది వాదన. కానీ ఈసారి పరిస్థితి మారనుంది. కూటమి ప్రభుత్వం పథకాలు కాకుండా అభివృద్ధి, సామాజిక సమీకరణంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. జగన్ గతంలో సంక్షేమమే తన ప్రధాన ఎజెండాగా పెట్టి ఓట్లు రాబట్టలని చూశారు, కానీ వర్కౌట్ కాలేదు.
గత ఎన్నికల్లో జగన్ అందరికీ సంక్షేమం అందించలేకపోయారని టీడీపీ, జనసేన తీవ్ర విమర్శలు చేశాయి. పథకాలు అమలయ్యాయి కానీ, ప్రజల అసంతృప్తిని తగ్గించలేకపోయాయి.
నారా లోకేశ్ ఈ అంశాన్ని గ్రామాల్లో వివరించగా, బీజేపీ కేంద్ర నిధులతోనే ఈ పథకాలు అమలయ్యాయని చెబుతోంది. ఇదంతా ప్రజలకు బాగా అర్థమయ్యిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టో ప్రాముఖ్యత తగ్గనుంది. అభివృద్ధి, సామాజిక సమీకరణ ప్రధాన అజెండాగా మారనుందని తెలుస్తోంది. టీడీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేస్తోంది. వీటి కోసం బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించింది. పవన్ కల్యాణ్ తన ప్రజా ఇమేజ్‌తో ముందుకు వెళ్లాలని చూస్తున్నారు.
మరోవైపు, హిందూత్వ ఓటు బ్యాంకును కాపాడేందుకు బీజేపీ, జనసేన కలిసి వ్యూహం రచిస్తున్నాయి. దీంతో వైసీపీ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పథకాలు, సంక్షేమం చర్చనీయాంశం కాకపోతే, జగన్ ఎన్నికల వ్యూహం ఎలా ఉండబోతుందో అనేది ఆసక్తిగా మారింది.