ఏపీ: మంత్రి నారా లోకేశ్ నిరుద్యోగులకు ఊరట కలిగించే ప్రకటన చేశారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఈ నెలలోనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగా కొత్త టీచర్లను విధుల్లోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని వివరించారు.
మంగళవారం నాటి శాసనమండలి సమావేశాల్లో వైసీపీ సభ్యులు డీఎస్సీ గురించి ప్రశ్నించగా, లోకేశ్ ఘాటుగా స్పందించారు. ఇప్పటికే డీఎస్సీ గురించి స్పష్టత ఇచ్చామని, మరలమరలా అడగడం అర్థం లేనిదని అన్నారు.
ఏపీ ప్రభుత్వం ఉద్యోగ కల్పనకు కట్టుబడి ఉందని, ముఖ్యంగా ఉపాధ్యాయ నియామకాల్లో వేగంగా ముందుకు సాగుతామని తెలిపారు.
వైసీపీ హయాంలో ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించలేదని, టీడీపీ హయాంలోనే పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయ్యాయని గుర్తు చేశారు. టీడీపీ పాలనలో 1,80,272 టీచర్ పోస్టులు భర్తీ చేశామని వివరించారు.
ఉపాధ్యాయ ఖాళీల భర్తీని ప్రాధాన్యతగా చూస్తున్నామని, ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు.