స్పోర్ట్స్ డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెమీఫైనల్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ కేరీ (61) అర్ధ శతకాలు చేయగా, ట్రావిస్ హెడ్ (39) ఆకట్టుకున్నాడు.
భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు తీయగా, జడేజా, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు (335) పట్టిన భారత ఆటగాడిగా నిలిచాడు.
రాహుల్ ద్రవిడ్ (334) రికార్డును అధిగమించిన కోహ్లీ, జోష్ ఇంగ్లిస్ క్యాచ్‌ను అందుకోవడంతో ఈ ఘనత సాధించాడు.
భారత జట్టులో కోహ్లీ తర్వాత రాహుల్ ద్రవిడ్ (334), అజహరుద్దీన్ (261), సచిన్ (256) ఉన్నారు. మొత్తం లెక్కల్లో మహేల జయవర్ధనె (440) అగ్రస్థానంలో ఉన్నాడు.
ఈ రికార్డు సాధించిన కోహ్లీపై ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత బ్యాటింగ్ ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి.