నాని నటిస్తున్న “ది ప్యారడైజ్” సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన “రా స్టేట్మెంట్” వీడియో చూసిన తర్వాత, ఇది ఒక ఎపిక్ లెవెల్ స్టోరీ అనిపించేలా ఉంది. నాని లుక్, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ కూడా కొత్తగా ఉండడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ సినిమాను హాలీవుడ్ క్లాసిక్ “గేమ్ ఆఫ్ థ్రోన్స్”తో పోల్చడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా నాని లుక్, నేరేషన్ స్టైల్, కథలోని మిస్టీరియస్ ఎలిమెంట్స్ చూసి చాలా మంది ఫ్యాన్స్ ఇంటెన్స్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. నాని ఈ సినిమాలో ఓ స్ట్రాంగ్ లీడర్‌గా కనిపించబోతున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
టీజర్ చివర్లో వచ్చే “**.. కొడుకు కథ” అనే డైలాగ్ కూడా హాట్ టాపిక్ గా మారింది. కథలో కాకుల నేటివిటీతో కూడిన సింబాలిజం ఉంటుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ వివరాలన్నీ కథలో గొప్ప లేయర్స్ ఉన్నాయని సూచిస్తున్నాయి.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా గతంలో “దసరా”తో రా మేకింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు “ది ప్యారడైజ్” మరింత ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి.
సినిమాలో నాని పాత్ర గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టైల్లో ఒక స్ట్రాంగ్ లీడర్‌గా ఉంటుందా లేదా ఇది పూర్తిగా డిఫరెంట్ కథనా? అనే ప్రశ్నకు సమాధానం సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా హైప్ తారాస్థాయికి చేరింది.