హారర్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్, తన పాపులర్ ఫ్రాంచైజీ కాంచనను మరో లెవెల్‌కి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ముని నుంచి మొదలైన ఈ ప్రయాణం, కాంచన సినిమాల ద్వారా భారీ విజయాలను అందుకుంది. ఇప్పుడు లారెన్స్ కాంచన 4ని మరింత గ్రాండ్‌గా, భారీ బడ్జెట్‌తో రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈసారి సినిమా బడ్జెట్ 70 కోట్ల వరకు ఉండబోతుందట. కాంచన 2 భారీ విజయం సాధించిన తర్వాత, కాంచన 3 కూడా డీసెంట్ రన్ సాధించింది. అయితే, గత సినిమాతో పోలిస్తే ఈసారి స్క్రీన్‌ప్లేను పూర్తి కొత్తగా డిజైన్ చేయనున్నట్లు టాక్. కథ, హారర్ ఎలిమెంట్స్, విజువల్ ఎఫెక్ట్స్ అన్నింటికీ హాలీవుడ్ స్థాయిలో స్టాండర్డ్స్ అమలు చేయాలని లారెన్స్ ఫిక్స్ అయ్యాడట.
ఈ సినిమా కేవలం తమిళ, తెలుగు మాత్రమే కాకుండా హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాంచన 4లో మూడో భాగం కన్నా స్టోరీలో మరింత కొత్తదనం ఉండేలా స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్ ఫాలో చేయనున్నారని ఫిలిం వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఈ సినిమాకు హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకున్నట్లు సమాచారం. ఆమె విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుందని అంటున్నారు. హారర్ సినిమాల్లో నటించడం పూజా హెగ్డేకి కొత్త అనుభవం అవుతుందనే ఊహాగానాలు ఉన్నాయి. ఇకపోతే, సినిమా ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
కాంచన 4 సిరీస్‌లోనే బిగ్గెస్ట్ హారర్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లారెన్స్ ఈసారి గత సినిమాల పరాజయాలను పునరావృతం కాకుండా, హారర్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ కలబోసి మరింత గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ప్లాన్ చేస్తున్నాడట. మరి, ఈ హారర్ ఫ్రాంచైజీ మరోసారి ప్రేక్షకులను భయపెడుతుందా? లేదా? అన్నది చూడాలి.