విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్‌ను మళ్లీ మాస్ ఫీస్ట్‌కి రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే కింగ్‌డమ్ అనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్న ఈ టాలెంటెడ్ హీరో, రవి కిరణ్ కోలా దర్శకత్వంలో మరో మాస్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా టైటిల్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ తాజాగా నిర్మాత దిల్ రాజు రివీల్ చేసిన లీక్ ఫ్యాన్స్‌లో సంచలనం రేపుతోంది.
దిల్ రాజు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ-రిలీజ్ వేడుకలో పాల్గొని, విజయ్ కొత్త సినిమా టైటిల్ రౌడీ జనార్ధన్ అని కన్ఫామ్ చేశాడు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమా పూర్తిగా మాస్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని సమాచారం. విజయ్ ఫ్యాన్స్ ఈ టైటిల్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకెళ్లారు.
విజయ్‌కి ‘రౌడీ’ అనే ట్యాగ్ ఎప్పటినుంచో ఉంది. తన ఫ్యాన్స్‌ను కూడా ‘రౌడీస్’ అని పిలిచే ఈ స్టార్, ఈ టైటిల్‌ను సెలెక్ట్ చేయడం అతని బ్రాండ్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోతుందని అభిమానులు అంటున్నారు. అయితే, ఇటీవల విజయ్ ది దేవరకొండ అనే కొత్త ట్యాగ్‌తో ముందుకు వచ్చినప్పటికీ, మళ్లీ మాస్ ఫ్లేవర్ ఉన్న టైటిల్‌కు ఓకే చెప్పడం విశేషం.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రవి కిరణ్ కోలా ఇప్పటికే స్క్రిప్ట్‌పై పూర్తి క్లారిటీతో ఉన్నట్లు టాక్. మేలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.