సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB29 గురించి రోజుకో లీక్ వైరల్ అవుతోంది. ఇది పాన్ వరల్డ్ మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మహేష్ పాత్రకు రుద్ర అనే పేరు పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. రాజమౌళి సినిమాల్లో పాత్ర పేర్లకు ప్రత్యేకమైన బలమైన నేపథ్యం ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.
ఈ సినిమాలో మహేష్ బాబు అడ్వెంచరస్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కథకు సంబంధించి చారిత్రక ప్రదేశాల్లో షూటింగ్ జరుపాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఒడిశా, కేరళతో పాటు ఆఫ్రికాలోని అనేక ఎగ్జోటిక్ లొకేషన్లలో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. మహేష్ కెరీర్‌లో ఇప్పటి వరకు చూడని కొత్త లుక్, విభిన్నమైన క్యారెక్టర్ ఈ సినిమాలో ఉండబోతుందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
అయితే, రుద్ర అనే పేరు వింటూనే ఫ్యాన్స్ కొన్ని ట్రోలింగ్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో శక్తి సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు ఇదే పేరు పెట్టడంతో, ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ పేరు ట్రోలింగ్‌కు గురైంది. కానీ రాజమౌళి క్యారెక్టర్లకు గొప్ప బేస్ ఉండేలా డిజైన్ చేస్తారని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
ఈ సినిమా దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుందని, బాహుబలి, RRR రేంజ్‌ను దాటి ప్రపంచ స్థాయిలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. SSMB29 రిలీజ్‌కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, ఇప్పటికే హైప్ తారాస్థాయికి వెళ్లిపోయింది. మహేష్ పాత్రకు ఏం పేరు ఫిక్స్ అవుతుందో, ఈ సినిమాతో ఆయన అంతర్జాతీయ మార్కెట్‌లో ఎలా నిలబడతారో చూడాలి.