టాలీవుడ్‌లో బడ్జెట్‌కు తగ్గట్టుగా భారీ సినిమాలు నిర్మించడంలో దిల్ రాజు ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్నాడు. తాజాగా, ఆయన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ జటాయు ప్రాజెక్ట్‌ను కొత్తగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా మొదట విజయ్ దేవరకొండతో చేయాలని అనుకున్నారు.
కానీ కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఇందులో స్క్రిప్ట్ మార్పులు, విజయ్ దేవరకొండ రీసెంట్ ట్రాక్ రికార్డ్ అన్నీ ప్రభావం చూపించాయి. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించాల్సిన ఈ సినిమాను దిల్ రాజు మరో స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
కొత్త రైటర్స్, కొత్త డైరెక్టర్‌తో స్క్రిప్ట్‌ను మరింత గ్రిప్పింగ్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడీ సినిమాకు ప్రభాస్‌ను అప్రోచ్ చేసే యోచనలో ఉన్నట్లు టాక్.
పాన్ వరల్డ్ మార్కెట్ ఉన్న స్టార్‌గా ప్రభాస్ ఉంటే, ఈ ఫాంటసీ మూవీ మరింత గ్రాండ్‌గా మలచేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే, అధికారిక అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.