టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుని క్రికెట్ ప్రపంచంలో మరోసారి తన సత్తా చాటింది. న్యూజిలాండ్‌ను ఫైనల్లో 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత్, విజయంతో పాటు భారీ మొత్తంలో ప్రైజ్ మనీ కూడా అందుకుంది.
విజేతగా నిలిచిన టీమిండియా రూ. 20 కోట్లు ($2.25 మిలియన్) గెలుచుకోగా, రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ రూ. 12 కోట్లు ($1.12 మిలియన్) ప్రైజ్ మనీ అందుకుంది.
ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మొత్తం రూ. 60 కోట్ల ($6.9 మిలియన్) ప్రైజ్ మనీ కేటాయించారు. సెమీఫైనల్‌లో ఓడిపోయిన జట్లకు చెరో రూ. 4.6 కోట్లు ($560,000) అందించగా, ఐదో, ఆరవ స్థానాల్లో ఉన్న జట్లకు రూ. 2.9 కోట్లు ($350,000) ఇచ్చారు.
ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచిన జట్లు రూ. 1.1 కోట్లు ($140,000) పొందాయి. 2013 తర్వాత భారత్ గెలిచిన తొలి ఐసీసీ కప్ ఇదే కావడంతో అభిమానులు ఎంతో ఆనందిస్తున్నారు.
రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు మళ్లీ ప్రపంచ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించడంలో విజయవంతమైంది. భారీ ప్రైజ్ మనీతో పాటు, ఈ కప్ గెలవడం భారత జట్టుకు మరింత గౌరవాన్ని తీసుకొచ్చింది.