తెలంగాణ: మాజీ మంత్రి కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. పెట్టుబడుల అంశంపై మాట్లాడుతూ, “ఆఖరుకు ఏపీకి కూడా పెట్టుబడులు వస్తున్నాయి, తెలంగాణకు మాత్రం రావడం లేదు” అంటూ చేసిన ట్వీట్ చేయగా రాజకీయ వర్గాల్లో వివాదాస్పధంగా మారాయి. ఈ వ్యాఖ్యలకు ఏపీ ప్రజలు, టీడీపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
ముఖ్యంగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న కేటీఆర్ తీరును ఖండించారు. ఏపీని తక్కువ చేసి మాట్లాడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయని, ఇకపై కేటీఆర్ సిరిసిల్లలో కూడా గెలిచే అవకాశం లేదని హెచ్చరించారు. ఏపీలో వృద్ధి సాధ్యమేనని నిరూపించేందుకు అవసరమైన ప్రతి చర్య తీసుకుంటామని అన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతమైన సెటైర్లు పడుతున్నాయి. “తెలంగాణకు పెట్టుబడులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేయడమే కానీ, ఇతర రాష్ట్రాలను కించపరచడం సరైన పద్ధతి కాదని” నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం పెద్దఎత్తున చర్చనీయాంశంగా మారింది.