‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో మహేష్ బాబు, వెంకటేష్ చెల్లిగా నటించి గుర్తింపు తెచ్చుకున్న అభినయ.. తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ప్రకటించింది. ఆమె తన ఎంగేజ్మెంట్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యానని తెలిపింది. గుడిలో తన కాబోయే భర్తతో కలిసి ఉన్న ఫోటో అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
అభినయ తన వ్యక్తిగత విషయాలను చాలా ప్రైవేట్‌గా ఉంచడం విశేషం. గతంలో తన చిన్ననాటి స్నేహితుడితో 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నానని చెప్పినా, అతని వివరాలను వెల్లడించలేదు. దీంతో సోషల్ మీడియాలో ఆమె భర్త ఎవరనే ఉత్సుకత పెరిగింది. అయితే, గతంలో తమిళ హీరో విశాల్‌తో పేరు కలిపిన వార్తలను అభినయ ఖండించింది.
తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో తన ప్రతిభను నిరూపించుకున్న అభినయ, మాటలు రాకున్నా హావభావాలతో అలరిస్తుంది. ఆమె నటించిన ధృవ, దమ్ము, గామి వంటి సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయి.
ప్రస్తుతం అభినయ ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ ఆమె పెళ్లికి సంబంధించిన మరిన్ని అప్డేట్ల కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే పెళ్లి తేదీ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.