ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ‘యానిమల్’తో దేశవ్యాప్తంగా క్రేజ్ పెంచుకున్న వంగా, ఇప్పుడు ‘స్పిరిట్’ ప్రాజెక్ట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ కూడా పూర్తిగా డెడికేట్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
సాధారణంగా, హీరోలు తమ సినిమాల మధ్య విరామం తీసుకుంటారు. కానీ, ‘స్పిరిట్’ విషయంలో మాత్రం 65 రోజుల నాన్‌స్టాప్ షూటింగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా, యాక్షన్ సీన్స్‌లో బాడీ డబుల్స్ ఉపయోగించకుండా ప్రభాస్ స్వయంగా చేయాలని దర్శకుడు డిమాండ్ చేశాడట.
సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి మొదలుకానుండగా, సంక్రాంతి 2026 టార్గెట్‌గా ప్లాన్ చేస్తున్నారు. వంగా తన కథల్లో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్ ఇంటెన్సిటీని బలంగా చూపించడంలో సక్సెస్. ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో ఉంటుందని టాక్.
ప్రభాస్ ఇటీవల వరుసగా భారీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా, ‘స్పిరిట్’ పూర్తిగా డిఫరెంట్ జానర్ అని చెబుతున్నారు. పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, రా యాక్షన్, డిఫరెంట్ స్టైల్‌తో ఈ మూవీ మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
,