fbpx
Wednesday, January 15, 2025
HomeAndhra Pradeshపశ్చిమ గోదావరి కలెక్టర్ కు సీఎం అభినందనలు

పశ్చిమ గోదావరి కలెక్టర్ కు సీఎం అభినందనలు

CM-APPRECIATES-WEST-GODAVARI-COLLECTOR

ఏలూరు : గోదావరి వరద సహాయక చర్యలు, పునరావాసం ఏర్పాట్లు బాగా చేశారని ముఖ్యమంత్రి, పశ్చిమ గోదావరి కలెక్టర్‌ ముత్యాలరాజును అభినందించారు. మంగళవారం, తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరద పరిస్థితి, కోవిడ్‌–19, ఇళ్ల పట్టాలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్, నాడు–నేడు, వైఎస్సార్‌ చేయూత, ఆర్‌బీకేలకు అనుబంధంగా గిడ్డంగుల నిర్మాణం వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

ఏలూరు కలెక్టరేట్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు మాట్లాడుతూ వరద ముంపునకు గరైన ఇళ్ల నష్టం అంచనా నమోదు ప్రారంభించామని వివరించారు. కోతకు గురైన పాత పోలవరం నెక్లెస్‌ బండ్‌ను పటిష్టపరిచే పనులను కూడా ఇప్పటికే చేపట్టామని పేర్కొన్నారు.

వచ్చే మూడు నెలల్లో వరదలు వచ్చినా కూడా ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుందని తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఏదైనా సహాయం అవసరమైతే ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డితో మాట్లాడాలని సూచించారు. తొలుత సీఎం జగన్‌ మాట్లాడుతూ వరద సహాయక చర్యల్లో కలెక్టర్‌ కృషి అభినందనీయమన్నారు.

సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టడంతోపాటు పునరావాస కేంద్రాల ఏర్పాటు, వారికి అందించాల్సిన సహాయాలు సకాలంలో అందించడంలో తీసుకున్న చొరవ చాలా ప్రశంసనీయమన్నారు. ముంపునకు గురైన గృహాల నష్టం అంచనా నివేదికలు త్వరగా పూర్తి చేసి సెప్టెంబర్‌ 7 నాటికి బాధితులకు సహాయం అందేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular