సాయి పల్లవి.. కమర్షియల్ హంగుల కంటే, పాత్రకు బలం ఉండాలనే తన సూత్రాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. అయితే, ఇప్పుడు టాలీవుడ్‌లో ఆమె పేరు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవిని తీసుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మైథలాజికల్ టచ్ ఉండబోతుందని, సాయి పల్లవికి ఇది కొత్త ఛాలెంజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా, త్రివిక్రమ్ తన కథలను ఎంతో బలంగా, లోతుగా రాసే దర్శకుడు.
కథ విన్న వెంటనే ఆ పాత్రలో ఒదిగిపోయేలా నేరేట్ చేయగల సత్తా ఆయనకు ఉంది. గతంలో కూడా త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది.
అయితే, సాయి పల్లవి ఒప్పుకోవాలంటే కథే కాదు, దర్శకుడి కన్విక్షన్ కూడా అతి ముఖ్యమైన అంశం. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఒకవేళ త్రివిక్రమ్ తన మంత్రంతో సాయి పల్లవిని ఒప్పించగలిగితే, ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో మరో బిగ్ హిట్ అవ్వడం ఖాయం.
అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటికే ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి వీరి కాంబో రాబోతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ కాంబినేషన్‌లో సాయి పల్లవి వస్తే, ఆ హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది.