ఇండియన్ సినిమా విజయాన్ని కొలిచే ప్రమాణాలు మారుతున్నాయి. గతంలో వసూళ్లే ప్రధానంగా పరిగణించేవారు. కానీ, ఇప్పుడు ప్రేక్షకుల సంఖ్య (ఫుట్‌ఫాల్స్) కూడా ఒక కీలక రికార్డ్ గా మారింది. ఈ నేపథ్యంలో పుష్ప 2 థియేటర్లలో భారీ సంఖ్యలో ప్రేక్షకులను రప్పించి అద్భుతమైన రికార్డు నమోదు చేసింది.
తెలుగు సినిమాల హవా పెరిగిన ఈ తరుణంలో, అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 దేశవ్యాప్తంగా అత్యధిక ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 6.12 కోట్ల ఫుట్‌ఫాల్స్‌తో టాప్ 10 జాబితాలో స్థానం సంపాదించింది. ఈ గణాంకం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా మారింది.
అతి తక్కువ సమయంలోనే పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో పాటు, థియేటర్లలో అత్యధిక సందర్శకులను ఆకర్షించింది. అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో చూపించిన శైలి, సుకుమార్ మేకింగ్ సినిమా విజయంలో కీలక భూమిక పోషించాయి.
ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక ఫుట్‌ఫాల్స్ సాధించిన టాప్ 10 జాబితాలో షోలే (12.73 కోట్లు) మొదటిస్థానంలో ఉంది. బాహుబలి 2 (10.77 కోట్లు) తర్వాతి స్థానంలో నిలిచింది. ఇప్పుడు పుష్ప 2 ఎనిమిదవ స్థానాన్ని ఆక్రమించింది.
ఈ రికార్డుతో తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగింది. భవిష్యత్తులో మరిన్ని తెలుగు సినిమాలు ఈ జాబితాలో చేరతాయనే నమ్మకం ఉంది.
అత్యధిక ఫుట్ ఫాల్స్ సాధించిన సినిమాలు
1. షోలే – 12.73 కోట్లు
2. బాహుబలి 2 – 10.77 కోట్లు
3. మగల్-ఎ-ఆజం – 9.17 కోట్లు
4. మదర్ ఇండియా – 8.89 కోట్లు
5. హమ్ ఆప్కే హై కౌన్ – 7.79 కోట్లు
6. గంగా జమున – 6.36 కోట్లు
7. క్రాంతి – 6.15 కోట్లు
8. పుష్ప 2 – 6.12 కోట్లు
9. ముకద్దర్ కా సికందర్ – 6.07 కోట్లు
10. సంగం – 5.71 కోట్ల