న్యూస్ డెస్క్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమికి తిరిగి రానున్నారు. క్రూ 10 షిప్ ఆదివారం ఉదయం 9:37 గంటలకు ఐఎస్ఎస్‌తో విజయవంతంగా అనుసంధానమైంది.
క్రూ 10 మిషన్‌లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు కొత్తగా ఐఎస్ఎస్‌లో పని చేయనుండగా, సునీత, బుచ్ భూమికి తిరుగు ప్రయాణం కానున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ నెల 19న వీరు భూమిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది.
2024 జూన్ 5న ‘స్టార్‌లైనర్’ వ్యోమనౌకలో ఐఎస్ఎస్‌కు చేరుకున్న సునీతా విలియమ్స్, వారం రోజుల పరిశోధనల కోసం వెళ్లినా, నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అక్కడే ఉండిపోయారు. స్టార్‌లైనర్ వ్యోమనౌక వీరిని వదిలేసి భూమికి చేరుకోవడం ఆందోళన రేపింది.
ఇప్పుడు క్రూ 10 రాకెట్ సురక్షితంగా డాక్ కావడంతో, వీరి భూమికి రాకపై హృదయాలకొద్దీ ఎదురుచూస్తున్న వారి కుటుంబ సభ్యులు, శాస్త్రవేత్తలకు ఊరట లభించింది.