స్పోర్ట్స్ డెస్క్: పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో ఉండగా, ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ మరింత లోటును తెచ్చిపెట్టింది. భారత్ భద్రతా కారణాలతో తమ మ్యాచ్‌లను పాక్‌లో ఆడకపోవడం, టోర్నమెంట్‌లో పాక్ జట్టు నిరాశపరిచే ప్రదర్శన ఇవ్వడం కలిసికట్టుగా భారీ నష్టాన్ని తీసుకొచ్చాయి.
ఫైనల్‌తో పాటు సెమీఫైనల్ మ్యాచ్ కూడా దుబాయ్‌లోనే జరగడంతో, స్పాన్సర్‌షిప్, టికెట్ ఆదాయంలో కోతపడ్డారు.
PCB అంచనా ప్రకారం, ఈ మెగా టోర్నమెంట్ నిర్వహణలో పాక్‌కు రూ. 869 కోట్ల మేర నష్టం వాటిల్లింది. మొత్తం మూడు వేదికల అప్‌గ్రేడ్ కోసం రూ. 18 బిలియన్ ఖర్చు చేసినా, టికెట్ అమ్మకాలు, స్పాన్సర్‌షిప్ ద్వారా తక్కువ ఆదాయం రావడం ప్రధాన సమస్యగా మారింది. ఇదే కాకుండా, పాక్ జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించడం ఆదాయాన్ని మరింత తగ్గించింది.
ఈ ఆర్థిక సమస్యల ప్రభావం నేరుగా ఆటగాళ్లపై పడింది. జాతీయ టీ20 ఛాంపియన్‌షిప్‌లో మ్యాచ్ ఫీజులను 90% తగ్గించగా, రిజర్వ్ ఆటగాళ్ల పారితోషికాన్ని 87.5% కట్ చేశారు.
అంతేగాక, ఆటగాళ్ల కోసం 5-స్టార్ హోటళ్లను రద్దు చేసి, సాధారణ హోటళ్లలో వసతి కల్పిస్తున్నారు. అయితే, PCB ఛైర్మన్ మోహ్సిన్ నక్వీ ఈ తగ్గింపులను పునఃసమీక్షించాలని సూచించారు.
పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తు మరింత సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ప్రధానంగా, అంతర్జాతీయ క్రికెట్ లో అడ్వాన్స్‌మెంట్ లేని పాక్ జట్టు, నష్టాలను భర్తీ చేసుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. ఇండియా వంటి బలమైన జట్లు పాక్‌లో ఆడేందుకు ఆసక్తి చూపకపోవడం కూడా ఆదాయ నష్టానికి కారణమవుతోంది.