స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో క్రికెట్ అభిమానులు ఓ ప్రత్యేక ఘట్టాన్ని చూడబోతున్నారు. కేవలం 13 ఏళ్ల వయసులోనే యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడే అవకాశం దక్కించుకున్నాడు.
ఇది ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన సంఘటనగా మారింది. అతడిని 1.1 కోట్ల రూపాయలకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
మార్చి 23న హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్ తొలి మ్యాచ్ ఆడనుండగా, వైభవ్ ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండర్-19 క్రికెట్‌లో ఆకట్టుకున్న అతను, ప్రెషర్‌ను ఎలా మేనేజ్ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. క్రికెట్ విశ్లేషకులు కూడా అతడిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
గతంలో తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లోనే 42 బంతుల్లో 71 పరుగులు చేసిన ఈ యువ క్రికెటర్, ఐపీఎల్‌లోనూ అలాంటి ప్రదర్శన ఇస్తాడా అనే ఉత్కంఠ నెలకొంది. బిహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాకేశ్ తివారీ, “వైభవ్ గొప్ప ఆటగాడిగా ఎదగాలి” అంటూ అతడికి మద్దతు తెలిపారు.
ఈ వయసులోనే అతనికి ఎదురయ్యే ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. ఐపీఎల్‌లో రానిస్తే, భవిష్యత్తులో భారత జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు కూడా ఎక్కువే. మరి, వైభవ్ అరంగేట్రం ఎలా ఉంటుందో చూడాలి.