‘కోర్ట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద స్టడీగా దూసుకుపోతోంది. విడుదలైన తొలిరోజే మంచి మౌత్ టాక్ అందుకున్న ఈ చిత్రం, ఐదో రోజుకి కూడా స్ట్రాంగ్‌గా నిలిచింది. ప్రియదర్శి, హర్ష రోషన్ ప్రధాన పాత్రల్లో రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కోర్ట్ డ్రామా, కంటెంట్ బేస్డ్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
నేచురల్ స్టార్ నాని ప్రెజెంటర్‌గా వ్యవహరించడంతో మరింత హైప్ ఏర్పడింది. చిన్న సినిమాలకు మామూలుగా నాలుగో రోజు నుంచి డ్రాప్ రావడం సహజం. కానీ ‘కోర్ట్’ వసూళ్లు తగ్గకుండా కొనసాగుతోంది.
ఐదో రోజుకి 4.65 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. అమెరికాలో కూడా ఈ సినిమా 800K డాలర్ల మార్క్ దాటి, 1 మిలియన్ డాలర్ల దిశగా దూసుకుపోతోంది. మొత్తంగా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ 30 కోట్ల మార్క్ ను చేరుకుంది.
ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ సినిమా మంచి లాంగ్ రన్ కలిగి హిట్‌గా నిలవనుంది. బుకింగ్స్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉండటంతో, వారం చివరికల్లా కొత్త రికార్డులు సెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ‘కోర్ట్’ తన స్టడీ గ్రోత్ కొనసాగిస్తే, టాలీవుడ్లో మరో కంటెంట్ బేస్డ్ హిట్‌గా నిలిచే అవకాశం ఉంది.