టాలీవుడ్లో మోహన్‌బాబు తన ప్రతిభతో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, విద్యాసంస్థల అధిపతిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన నేడు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అయితే, గత కొంతకాలంగా మంచు కుటుంబంలో విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. మోహన్‌బాబు, మనోజ్ మధ్య ఆస్థి వివాదాల కారణంగా విభేదాలు తలెత్తాయి. ఇటీవల మోహన్‌బాబు తన కొడుకు మనోజ్‌పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
అయితే, ఈ పరిస్థితుల్లోనూ మనోజ్ తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. “నాన్నా, నీ పక్కన ఉండాలి. ఆ క్షణాలను మిస్ అవుతున్నాం” అంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు.
అంతేకాకుండా, తండ్రి, కుమారుడిగా కలిసి ఉన్న అనేక ఫొటోలు షేర్ చేశారు. ముఖ్యంగా యానిమల్ సినిమాలోని “నాన్న” పాటను జత చేయడం అభిమానులను సెంటిమెంట్‌లో ముంచేసింది. ఈ పోస్ట్ చూసిన వారంతా వీరి మధ్య మళ్లీ అనుబంధం ఏర్పడుతుందా? అనే చర్చ మొదలైంది.
ఇక మంచు లక్ష్మీ కూడా తండ్రికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో, మోహన్‌బాబు – మనోజ్ మధ్య విభేదాలు తగ్గుతాయా అనేది ఆసక్తిగా మారింది. అభిమానులు వీరిద్దరూ త్వరలోనే కలిసిపోవాలని కోరుకుంటున్నారు.