ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్‌లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతో మొదలై, తాజాగా లొకేషన్ మార్చినట్టు తెలుస్తోంది. లేటెస్ట్గా చిత్రబృందం శ్రీలంకలో కీలక యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
70ల నాటి నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సెట్స్ వేసి, పాత వాహనాలు, వాతావరణాన్ని అందించేందుకు టీమ్ కష్టపడుతోందట. లీకైన ఫోటోల ప్రకారం, ఎన్టీఆర్ పాత్ర ఓ గ్లోబల్ మాఫియా లీడర్‌గా ఉండబోతుందనే టాక్ బలపడుతోంది. మునుపెన్నడూ లేని రఫ్, రగ్డ్ లుక్‌లో తారక్ కనిపించనున్నారని అభిమానులు ఊహిస్తున్నారు.
శ్రీలంకలో అడవుల్లో భారీ యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేశారు. హై ఓక్టేన్ ఛేజింగ్, భారీ యాక్షన్ బ్లాక్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండనున్నాయి. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాతే సినిమా టోన్ పూర్తిగా బయటకు వస్తుందని అంటున్నారు.
ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ రూ. 300 కోట్లకు పైగానే ఉంటుందని, 2026 సంక్రాంతి లేదా వేసవిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకున్నాడని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.